ప్రతిపక్షం, నేషనల్: ప్రధాని మోడీ నేడు దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటికి కేంద్రం మొత్తం రూ.41వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇదే అంశంపై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు రైల్వేస్‌కు చారిత్రత్మాక రోజు. మధ్యాహ్నం 12.30కు రూ.41వేల కోట్లతో 2000 రైల్వే ప్రాజెక్టు పనులను జాతికి అంకితం చేయనున్నాను. ప్రయాణాలను మెరుగుపరిచేందుకు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 స్టేషన్లను పునరుద్ధరించాం. ఈ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నాను. దేశవ్యాప్తంగా ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లను ప్రారంభించనున్నాం. భారతదేశం అంతటా ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు కూడా ప్రారంభించబడతాయి. ఈ పనులతో ప్రజలకు‘ఈజ్ ఆఫ్ లివింగ్’ని అందిస్తాయి.’ అని మోడీ ట్వీట్ చేశారు.