ప్రతిపక్షం, ఏపీ: విశాఖపట్నం – గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత విజయవంతమైన స్టార్టప్ కంపెనీగా ఉన్న బైజూస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్టణ పరిధిలోని గాజువాక బైజూస్ విద్యా సంస్థలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం సంబంవించింది. అయితే, ప్రమాదానికి షాక్ సర్య్కూటే కారణమని అంటున్నా.. అసలు విషయం మాత్రం తెలియాల్సింది. ప్రస్తుతం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది భవనంలోంచి ఎగసిపడుతోన్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.