ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : వినూత్నం.. విశేషం.. సూర్య ప్రతాపని తట్టుకోలేని కొంతమంది తమదైన రీతిలో సంబంధిత శాఖల అధికారులకు తమకు అది కల్పించాలని తమకు అది కావాలంటూ వినతి పత్రాలను సమర్పించుకోవడం జరుగుతుంది. ఇలాంటిదే ఓ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మండుటెండలలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా.. చల్లని పానీయం రూపంలో లభించే ఆ బీర్లు మాకు లభించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెంట్ కు వినతి పత్రం సమర్పించారు. ఆ చల్లని దాహార్తిని తీర్చే బీర్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ కోరారు.
ఒకవైపు సూర్యప్రతాపంతో ఇబ్బందిపడుతున్న మాలాంటి వారికి ఇతర సౌకర్యాలు మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కల్పించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వైన్స్ షాప్ లు, బార్ లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభించకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎండలు రోజుకో రూపం దాల్చుతుండడంతో తమలాంటివారు కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభించకపోవడంతో పడరాన్ని పాట్లు పడుతూ ఆగమ్య గోచరులవుతున్నారని వాపోయాడు.