ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈ నెల 13న యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. కాగా, ఈ పురస్కారాన్ని రామ్‌చరణ్‌కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందజేయనున్నారు.
చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ గతంలో ఈ గౌరవ డాక్టరేట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ షణ్ముగం లాంటి వాళ్లకు కూడా అందించింది. ఇప్పుడు చరణ్ కూడా వాళ్ల సరసన నిలవనున్నాడు. ప్రస్తుతం అదే శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీలో చెర్రీ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలతోపాటు ఓ పారిశ్రామికవేత్తగా కూడా అతన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాలని వెల్స్ యూనివర్సిటీ నిర్ణయించింది. సుమారు 17 ఏళ్లుగా అతడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. రెండేళ్ల కిందట వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ కాస్తా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈ మూవీలో అతడు పోషించిన రామ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.