ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. జూన్ 30తో గడువు ముగియనుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.