ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట..
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని, అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ కేసులో సంజయ్ 6 నెలల పాటు జైలులో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు.