నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 04 : వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో యుద్ధ ప్రతిపాదికన్నా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ ,మంచిర్యాల చౌరస్తా ఈద్గాం, శాస్త్రి నగర్ ,నటరాజ్ నగర్, బోయివాడ, పెట్రోల్ బంక్, వైయస్సార్ కాలనీ జిఎన్ఆర్ కాలనీ, సిద్దాపూర్, అస్రా కాలనీ ప్రాంతాలలో అయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన అంతర్గత మురికి కాలువలు రోడ్లను పరిశీలించారు.
భారీ సాధారణ వర్షాలు కురిచినప్పుడు ఎదురయ్యే వరద నీటి సమస్యలు ఇతర వాటిని వ్యక్తిగతంగా పరిశీలించారు. వర్షాకాల నేపథ్యంలో సుమారు నెల రోజుల క్రితం నుండే ఇరిగేషన్ మున్సిపాలిటీ సమన్వయంతో ముందుకేళ్తున్నామని పేర్కొన్నారు.
గతంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి,మున్సిపాలిటీ పాలకవర్గం పరంగా ఔళినాళా, ప్రధాన మురికి నీటి నాళాలు కల్వర్టులు శుభ్రం చేయించడంతో పాటు పరిసరాలలో ఆక్రమాణాలను కూడా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలోవర్షాకాలం వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు ప్రధాన అంతర్గత మురికి కాలువలు రోడ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అందుకే ముందస్తు చర్యలు యుద్ధ ప్రతిపాదికను తీసుకుంటున్నామని తెలిపారు.
పట్టణ శివారు లోతట్టు ప్రాంతాలలో ప్రజలు భారీ సాధారణ వర్షాలు కురిసినప్పుడు అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఇప్పటికే గతంలో వరద కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు యుద్ధ ప్రతిపాదికను తగ్గిన విధంగా సౌకర్యాలను కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నీటిపారుదల రెవెన్యూ పురపాలక శాఖ అధికారుల సమన్వయంతో పాటు సలహా సూచనలను తీసుకుంటూ భవిష్యత్తులో నిర్మల్ పట్టణంలో ఎలాంటి ఆనర్దాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సి.వి.ఎన్ రాజు, ఇరిగేషన్ అధికారులు, డి.ఈ జాదవ్, సంతోష్, టి.పి.ఓ సుమలత, టి.పి.యస్. నవీన్, ఏ.ఈ హరి భూవన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.