అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 8 : కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన వెళ్లకుండా.. అవమానించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు సైతం దూరంగానే ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 500 సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణ తరువాత నిర్మాణమైన గుడిలో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కావాలనే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని.. అలాంటి పార్టీని ప్రజలు సైతం దూరంగా ఉంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు.. ఎలాంటి ఆశలకు పోకుండ నిస్వార్థంగా, నిబద్ధతతో ని చేసే కార్యకర్తలు ఇంద్రవెల్లి మండల బీజేపీ లో ఉన్నారని కొనియాడారు. మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం, గ్రామంలో ఉన్న వ్యక్తులు, గ్రామాలలోని సమస్యలు నాకు తెలుసని, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీజేపీ విజయంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదిలాబాద్ ఎమ్మెల్యే, పార్లమెంట్ ఇంచార్జ్ పాయల శంకర్ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని.. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడు మన అభ్యర్థిగా ఉన్నారని, అటువంటి వ్యక్తికి టెకెట్ ఇవ్వడంతో గెలుపు సునాయాసంగా మారిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. అదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపి గెలవడం ఖాయమని ఆ గెలుపులో ఇంద్రవెల్లి మండల మెజారిటీ సుస్పష్టంగా కనిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు 300 మంది బీజేపీ పార్టీ కండువ కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్, జిల్లా ఉపాధ్యక్షులు సిడం భీంరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.