Trending Now

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు. ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు ప్రయోగం వాయిదా పడింది.

సాంకేతిక సమస్యలు..

అయితే సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి కావడంతో ఎప్పుడు మళ్లీ ప్రయోగిస్తారన్నది మాత్రం తెలియలేదు. దీనిపై త్వరలో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారిక ప్రకటన చేసేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

Spread the love

Related News