ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం.. ఎన్నికల కోడ్ రాకపోతే మరి కొన్ని అమలు చేసే వాళ్ళమని.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మిగతా పథకాలు అమలు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తాజ్ కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. వర్షాల తో నష్ట పోయిన రైతులను మేము ఆదుకుంటాము. బీజేపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదు.. పది ఏండ్ల లో బీజేపీ చేసిన అభివృద్ధి పనుల మీద ఓటు లు అడగడం లేదు. కేవలం కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు.. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపెడుతుందన్నారు. మోడీ కేవలం మంగళ సూత్రాలు, ముస్లిం రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. హిందువుల ఆస్తులు ముస్లిం లకు ఎలా పంచుతారు. అంబానీ, అదానీ కోసం బీజేపీ పని చేస్తుంది. మోడీ ప్రధాని స్థాయిలో మాట్లాడడం లేదని బీజేపీపై ఫైరయ్యారు.
ఇండియా కూటమి అదికారంలోకి రావడం తోనే కేంద్ర ప్రభుత్వం లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపడుతామని స్పష్టంచేశారు. హైదారాబాద్ ను బీజేపీ నిర్లక్ష్యం చేసింది.. హైదారాబాద్, బెంగళూర్, ముంబాయి కు రావాల్సిన పెట్టుబడి దారులకు బెదిరించి గుజరాత్ కు తరలించుకు వెళ్ళారు. పువ్వులు పొద్దున పూస్తాయి సాయంత్రం వాడిపోతాయి.. చెయ్యి ఎప్పుడు మీతోనే ఉంటుందన్నారు. రేవన్నపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీజేపీ వాళ్ళు నిరాశ తో మాట్లాడుతున్నారు.. ఇక్కడి ప్రభుత్వం 5 ఏండ్లు ఉంటుంది. మోడీ, మొఘలులు, ముస్లిం మటన్ మంగళ సూత్రాలు గురించి మాట్లాడతాడు.. అభివృద్ధి గురించి మాట్లాడడు. ఖర్గే అల్లుడి పై వచ్చిన 500 కోట్ల ఆరోపణల పై స్పందిస్తూ విచారణ చేసుకుని దోషి గా తెలితే శిక్ష వేయండని స్పష్టంచేశారు.
ఈ ప్రెస్ మీట్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నాసర్ హుసేన్, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ మీడియా చైర్మన్ రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.