Trending Now

Amith Sha: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాం: అమిత్ షా

Amit Shah's key comments: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరణకు ఎవ్వరూ సాహసించలేరన్నారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కిశ్త్‌వార్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని, మరోసారి కనిపించనంత స్థాయిలో పాతిపెడతామని అన్నారు. ‘ప్రధాని మోదీ పాలనలో దాన్ని పునరుద్ధరించేందుకు ఎవరూ సాహసించలేరు. ఉగ్రవాదుల విడుదల గురించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలో పేర్కొంటున్నారు. ఇది మోదీ ప్రభుత్వం. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఏ శక్తీ పునరుద్ధరించలేదు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News