ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే క్లైమాక్స్ పూర్తికాకపోవడంతో ఈ మూవీకి పార్ట్-2 ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాస్కిన్‌తో అశ్వత్థామ, భైరవ పోరాడే కథ కొనసాగుతుందని, కల్కికి సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. కానీ, దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సినీవర్గాలు అంచనా. కాగా ప్రభాస్ ‘సలార్’కు కూడా సీక్వెల్ ఉంది.