Another Vande Bharat train to Telangana: ప్రయాణికులు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు కేటాయించగా.. తాజాగా, మరో రైలు కేటాయించడంతో 5కు చేరింది.
ఈ రైలు సికింద్రాబాద్, నాగపూర్ స్టేషన్ల మధ్య సేవలు అందించనుంది. నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరనున్న ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి..రాత్రి 8.20 గంటలకు నాగపూర్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, నాగపూర్ మధ్య ఉన్న 578 కి.మీల దూరాన్ని కేవలం 7 గంటల్లో చేరుకోనుంది.