Trending Now

AP Government: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

AP Secretariat employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ కోరింది. సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు సమాధానమిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారు వివరణ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News