Trending Now

AP Government: ఏపీలో ‘భారత్‌ నెట్‌ ప్రాజెక్టు’ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

BharatNet Project in AP: ఆంధ్రప్రదేశ్‌లో ‘భారత్ నెట్ ప్రాజెక్టు’ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. భారత నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్, కార్యదర్శితో ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ మేరకు భారత్ నెట్ రెండు దశలో ఖర్చు చేసిన రూ.650 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాలని వినతులు అందజేశారు.

ఇదిలా ఉండగా, ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 9.7 లక్షలు గృహాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలు అందుతుండగా..రాష్ట్రంలో ఉన్న మొత్తం 6,200 పాఠశాలలు, 1,978 ఆరోగ్య కేంద్రాలు, 11,254 గ్రామ పంచాయతీలు, 5,800 రైతు కేంద్రాలతోపాటు 9,104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందుతున్నాయన్నారు. అలాగే భారత్ నెట్ ఫేజ్ 3 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనున్నట్లు వివరించారు.

Spread the love

Related News

Latest News