Trending Now

AP: గుడ్లవల్లేరు కాలేజీలో దారుణం.. గర్ల్స్‌ హాస్టల్ వాష్‌రూంలో సీక్రెట్ కెమెరా!

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కొందరు కామాంధులు చేస్తోన్న పనికి మొత్తం సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో దారుణం వెలుగు చూసింది. కాలేజ్‌లోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు కనిపించడం సంచలనంగా మారింది. దాదాపు 300కుపైగా విద్యార్థినుల వీడియోలు రికార్డు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలను అదే కాలేజ్‌లోని బాయ్స్‌ హాస్టల్‌లో అమ్మినట్లు సమాచారం. గర్ల్స్‌ హాస్టల్‌లో ఉండే ఓ అమ్మాయి సాయంతో బీటెక్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ వీడియోలు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన‌ కొనసాగించారు. హిడెన్ కెమెరాలో రికార్డయిన వీడియోలను అమ్ముకున్నాడంటూ బీటెక్ ఫైనల్ విద్యార్థిపై దాడికి యత్నించారు. వారం రోజుల క్రితమే హిడెన్ కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం దీనిపై న్యాయ విచారణకు ఆదేశించింది.

Spread the love

Related News

Latest News