Cummins compares Pant’s impact for India: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పంత్(109) సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. రెండేళ్ల క్రితం కారు ప్రమాదానికి గురైన పంత్.. తిరిగి ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి అందరినీ ఆకర్షించాడు.
ఈ టెస్ట్ సిరీస్ తర్వాత నవంబర్‌లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఆస్ట్రేలియాతో భారత్ 5 టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పాడు. టీమిండియాను నిలువరించాలంటే రిషబ్ పంత్‌ను కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు ఇక్కడా కూడా దూకుడుగానే ఆడతారన్నారు. ముఖ్యంగా రిషభ్ ఎక్కువగా అద్భుతమైన రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడని, అదే అతడి బలం అన్నారు. ఈ సిరీస్‌లో పంత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుకు కళ్లెం వేస్తామని కమిన్స్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.