Trending Now

జూన్ 3 నుండి 19వ వరకు బడిబాట : కలెక్టర్

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 30: జూన్ 3 నుండి 19వ తేదీ వరకు ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి బడిబాట కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో ఉండాల్సిందేనని అన్నారు. జూన్ 3వ తేదీ నుండి 19వ తేదీ వరకు గ్రామాలు మరియు మున్సిపాలిటీలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొని ఇంటింటికి వెళ్లి డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడి బడుల్లో చేర్పించాలని అన్నారు. అదేవిధంగా ఎంతో కష్టపడి వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివించే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, ఉచిత విద్య, కాంపిటేటివ్ పరీక్షలలో ఉన్నతంగా నిలిచి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు చదువు చెబుతారు. కాబట్టి ఇన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులను పంపించాలని మోటివేట్ చేయాలని అన్నారు.

అడ్మిషన్ దొరకని ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థులు లేక మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో కూడా మళ్లీ విద్యార్థులు వచ్చేలా తల్లిదండ్రులకు మోటివేషన్ చేయాలని అన్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని, విద్యార్థులను బడుల్లో చేర్పించడంలో పూర్వ విద్యార్థులకు భాగస్వామ్యాన్ని కల్పించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని అన్నారు. ముఖ్యంగా అసలే పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వసతి గృహాలలో కూడా ఉచిత భోజన, వసతి పొంది చదువుకునే విధానంపై కూడా ఈ బడిబాట కార్యక్రమంలో వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, డీఆర్డివో జయదేవ్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, డిడబ్ల్యూఓ శారద, డివిజనల్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News