ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: BJP జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రేపు ‘రైతు దీక్ష’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, సాగునీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని, పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదని.. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద దీక్ష చేయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.