నిర్మల్, ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16: బాసర త్రిబుల్ ఐటీ లో పీయూసీ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిరసిస్తూ.. ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నవీన్ ఉపాధ్యక్షులు సంతోష్, సాయి కుమార్ లు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన అరవింద్ కుమార్ మృతదేహాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదేపదే బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఉన్న వాస్తవ విషయాలను ప్రభుత్వాలు వెలికితీయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వారు ఆరోపించారు.
ఇప్పటికీ 10 నుంచి 12 మంది విద్యార్థులు ట్రిబుల్ ఐటీ సముదాయంలోనే ఆత్మహత్య చేసుకోవడంలో ఉన్న అసలు విషయాన్ని గుర్తించకపోవడం దారుణమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సీబీఐ ఎంక్వయిరీ చేసి ఆత్మహత్యలకు గల కారణకుల కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీసులు అడ్డుకొని నివారించారు.