మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 17: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నిర్వహించిన బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మగ్గం వర్క్స్ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి హాజరై మాట్లడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజాభివృద్ధిలో ముఖ్య భూమికను పోషిస్తున్నారని అదే విధంగా యూనియన్ బ్యాంక్ గ్రామీణ శిక్షణ సంస్థ అద్వర్యంలో జిల్లాల్లో డిమాండ్ ఉన్న కోర్సు లను ఎంపిక చేసి గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు. శిక్షణ పూర్తి చేసారు కావున వెంటనే బ్యాంకు ద్వారా ఋణాలు తీసుకొని యూనిట్ ను స్థాపించాలని కోరారు.
మెదక్, సిద్దిపేట DDM NABARD కృష్ణ తేజ, నిఖిల్ రెడ్డి లు సంయుక్త ఆధ్వర్యంలో మాట్లడుతూ.. దేశంలో ఉన్న అన్ని RSETI లు అన్నియువత నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తున్నాయని, మన జిల్లాలో RSETI గురించి అందరికి తెలిసేలా చేసి మన జిల్లాను నైపుణ్య జిల్లాగా మార్చుకోవాలని కోరారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యజిత్ హాజరై శిక్షణార్డులను ఉద్దేశించి మాట్లడుతూ RSETIలు కేవలం నైపుణ్య కేంద్రాలే కాకుండా మానవ సంబంధాలు, వ్యాపార నిర్వహణ మెలకువలు కూడా నేర్పియడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో అర్హులైన వారికి వివిధ పథకాల ద్వారా ఋణాలు ఇప్పించే బాధ్యత లీడ్ బ్యాంక్ ద్వారా చేస్తానని తెలిపారు. సంస్థ డైరెక్టర్ రాజ లింగం మాట్లడుతూ.. 2015 నుండి ఇప్పటి వరకూ దాదాపు 5000 మంది యువతకు వివిధ రకాల నైపుణ్య శిక్షణలు ఇచ్చిన వారిలో 70% మందికి వివిధ బ్యాంకుల ద్వారా ఋణాలు తీసుకొని యూనిట్ ను స్థాపించుకున్నారని, సుమారు 85% మంది స్వయంగా స్వయం ఉపాధి ద్వారా స్థిరపడ్డారని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి చేతులు మీదుగా ధ్రువపత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది మొహమ్మద్ నజీమ్, నాగ రాజు, శ్రీనివాస్, స్వప్న, ప్రశాంత్, అరవింద్, కనకవ్వ మొదలగు వారు పాల్గోన్నారు.