ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు. ”కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు అది ఇష్టం లేదని.. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని.. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు” అని ఆరోపించారు.