Trending Now

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం..

గ్యారెంటీల అమలు ఇంకెప్పుడు..?

బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 8: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు తొలి కేబినెట్ సమావేశంలోనే హామీలన్నీ అమలు చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. గ్యారంటీలంటూ గారడీ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.

పంటల సీజన్ ప్రారంభమైనా విత్తనాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఇంకా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందని దుయ్యబట్టారు. హామీల అమలుకు ఎంత డబ్బు కావాలి.. ఎలా సమీకరించాలి అనే విషయాలపై కాంగ్రెస్ సర్కారుకు కనీస స్పష్టత కూడా లేదని విమర్శించారు. ప్రజాగ్రహానికి గురికాకముందే ఇచ్చిన హామీ మేరకు గ్యారెంటీలు అమలు చేయాలని దినేష్ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News