ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూన్ 15 :
నిర్మల్ జిల్లా మామడ మాజీ మంత్రి ఎంపీపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ బీ ఆర్ ఎస్ నాయకులు హరీష్ కుమార్ ను గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మామడ మండలం పొన్కల్ లోని నివాసంలో నుంచి ఆయన కారులో ఎత్తుకెళ్లారు. అగంతకులు తనకు మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. అదే సమయంలో హరీష్ కుమార్ తన సన్నిహితులకు ఫోన్ లు చేసి నగదు అరేంజ్ చేయాలని కోరినట్లు సమాచారం.