ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కాగా ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దానం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన దానం.. అదే ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు.