ప్రతిపక్షం, తెలంగాణ: గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గ్రూప్-1 హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలారా..? అని కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై కవిత ఫైరయ్యారు. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని..? రోస్టర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు.