ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు మరో షాక్ తగిలింది. నేటితో జుడీషియల్ గడువు ముగియగా ED అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. గత నెల 15న కవితను ED అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నిన్న కోర్టు కొట్టేసింది.