Cement Rates Hikes: ఇల్లు కట్టుకోవాలనునే వారికి షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరల్ని భారీగా పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు రామ్‌కో, ఏసీసీ, దాల్మియా భారత్, ఇండియా సిమెంట్స్ సహా ప్రధాన సిమెంట్ కంపెనీలు ధరల్ని పెంచినట్లు సమాచారం. 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది.