CM Revanth Reddy comments On Musi River: మూసీ నదీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, ఇందుకోసం 33 బృందాలు అధ్యయనం చేశాయని రేవంత్ రెడ్డి అన్నారు. మేం చేపడుతున్న ప్రాజెక్టు మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవమన్నారు. కొంతమంది మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని, అందరికీ మెరుగైన జీవితం అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 300 కి .మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉందని వెల్లడించారు.