ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. దీంతో అధికార లాంఛనాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో లాస్యనందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. దీంతో లాస్య భౌతికాయాన్ని సందర్శనార్థం అశోక్ నగర్ దోమలగూడలోని ఆమె నివాసానికి తరలిస్తున్నారు. అనంతరం మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు.