CM Revanth Announces Compensation to Flood Affected Families: ఖమ్మంలో వరదలు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమన్నారు. ఈ మేరకు ఇళ్లు దెబ్బ తిన్న వరద బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10వేలు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే పశువులు మరణిస్తే రూ.50వేలు, గొర్రెలు, మేకలు మరణిస్తే రూ.5వేలు అందించనున్నట్లు తెలిపారు.
అలాగే, ఇళ్లకు నష్టం జరిగితే పీఎం ఆవాస్ యోజన కింద ఆర్థికసాయం అందజేస్తామన్నారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే వాటికి అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. వరదల ప్రభావంతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రతీ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు.