CM Revanth: ప్రజలకు సీఎం వినాయక చవితి విషెస్.. కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ

CM Revanth says Ganesh Wishes: నేడు వినాయక చవితి పండగ. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని కోరారు. భక్తుల రద్దీ ఎక్కువగా మండపాల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కాగా, ఈ ఏడాది వినాయకుడి మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి గణేష్ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, 70 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పు తో ప్రపంచంలోనే ఎత్తైన గణేషుడిగా ఖైరతాబాద్ గణేష్ రికార్డ్ కెక్కింది.

Spread the love

Related News