Trending Now

ఇండ్లు కూల్చిన ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రతిపక్షం, మంథని, మే 27 : రహదారి విస్తరణలో రామగిరి మండలంలోని నాగేపల్లి ప్రధాన చౌరస్తా వద్ద ముందస్తు సమాచారం లేకుండా పోలీసు బాలగాలతో ఇండ్లను కూల్చి వేశారని సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పూదరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని బీఆరెస్ నాయకున్ని అయిన నాపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కనీసం మార్కింగ్ ఇవ్వకుండా నోటీసు గానీ.. ముందస్తు సమాచారం గాని లేకుండా ఏకంగా ప్రోక్లైన్ తో ఇండ్లను కూల్చి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్కింగ్ ఇస్తే తామే స్వచ్చందంగా తొలగిస్తామని చెప్పినా వినకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని, ప్రొటెక్షన్ కోరిన ఆర్ అండ్ బీ అధికారులు లేకుండా ఎలా కూలుస్తారని పోలీసులను అడిగినా తమను గేంటేసి ఇండ్లు కూల్చారని తెలిపారు. ఈ విషయంగా కలెక్టర్ తో పాటు మానవ హక్కుల సంఘం, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట రత్నాపూర్ ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, సెంటినరీకాలనీ బీఆరెస్ పట్టణ అధ్యక్షుడు కాపురవేన భాస్కర్ ఉన్నారు.

Spread the love

Related News

Latest News