ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 10 : వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులకు కాపర్ వైర్ దొంగలు పట్టుబడ్డారు. మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లద్నాపుర్ ఓసిపి-2 వద్ద ఈ నేల 5న రాత్రి సమయంలో జరిగిన రాగి వైరు దొంగతనం కేసులో బుధవారం ఉదయం నాగేపల్లి ఎక్స్ రోడ్ లో రామగిరి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఒక సంచితో బైక్ పై అనుమాదాస్పదంగా కనబడగా వారిని అపి చేసిన తనిఖీలో సంచిలో 24 కిలోల కాపర్ వైరు దొరికినట్లు తెలిపారు. 85వేల రూపాయల విలువ గల కాపర్ వైర్ తో దొరికిన వారిని నవాబ్ పెట్ గ్రామానికి చెందిన పస్తాం తిరుపతిగా, సుల్తానాబాద్ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మోటం అజయ్ లుగా గుర్తించారు. విచారించగా లద్నాపూర్ ఓసిపి-2 వద్ద దొంగతనం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే అదుపులో కి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కొరకు కోర్టుకు పంపినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.