Deputy CM Pawan’s visit to flooded areas: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు కాలువకు గండిపడి వారం రోజులుగా స్థానికులు వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకుని అక్కడి జగనన్న కాలనీ చేరుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పటికీ పడవలో ప్రయాణించి బాధితులను కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారని సమాచారం. జిల్లా అధికారులతో మాట్లాడి బాధితులకు తక్షణ సాయం అందించాలని సూచించారు.