హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వార్తలపై ఉత్కంఠ వీడింది. కేసీఆర్‌తో సమావేశం అనంతరం తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆరూరి రమేష్ ప్రకటించారు. ముఖ్యంగా తాను బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవలేదని చెప్పారు. బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్ భావించారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. అంతేకాకుండా ఆరూరి రమేష్‌ను వెంటబెట్టుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆరూరి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంగళవారం నాడు బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవలేదని తెలిపారు. అలాగే తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు.