Trending Now

వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి..

నిర్మల్ : (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 01: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు త్రాగునిటీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని రవింద్రనగర్ తండా ను ఆయన సందర్శించారు. ఆర్ డబ్ల్యు ఎస్ కు సంబంధించి నీటి సౌకర్యాలు, తండా లో నిరంతరాయమైన విద్యుత్ సరఫరా సక్రమంగా జరుగుతున్నదీ లేనిది తండా వాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలం నేపథ్యంలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలని, పైప్ లైన్ లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు ప్రజలకు ఎదురవుతున్న సంబంధిత స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఉద్యోగులు సిబ్బందిపై కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ సందర్భంగా హెచ్చరించారు. వేసవి దృష్ట్యా ఎలాంటి నీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని తగిన విధంగా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన తండాలలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైతే తన దృష్టికి కూడా తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా తండా లో ముందు జాగ్రత్త చర్యగా వేసిన నూతన బోర్వెల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో డి పీ ఓ శ్రీనివాస్, ఆర్ డబ్లూ ఎస్ సందీప్, ఎం పి ఓ తిరుపతి, పంచాయతీ సెక్రటరీ హర్ష తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News