ప్రతిపక్షం, దుబ్బాక. మార్చి 27: శాంతి యుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం దుబ్బాక, భూంపల్లి, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లను సందర్శించి పోలీస్ అధికారులను సిబ్బందికి నిర్వహించవలసిన విధులు విధానాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, భూంపల్లి ఎస్ఐ రవికాంత్, మిరుదొడ్డి ఎస్ఐ పరశురామ్ లను పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గురించి, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి, అడిగి తెలుసుకుని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి, పట్టిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నుండి ఈరోజు వరకు బైండోవర్ కేసుల గురించి, నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూటివ్, ప్రైవేట్ గన్ డిపాజిట్, సీజ్ చేసిన డబ్బులు, ఫ్లాగ్ మార్చ్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అడిగి తెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా విధులు నిర్వహించాలని సూచించారు.