ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కొత్తగా QR కోడ్ విధానాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకొచ్చింది. రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే QR కోడ్ ఉంటుంది. వినియోగదారులు ఫోన్‌లో దీనిని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి రాగా.. త్వరలో అన్ని జిల్లాల్లో QR కోడ్ బిల్లులు రానున్నాయి.