నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లాలోని సోన్ మండల పరిధిలో గల కడ్తాల్, లెఫ్ట్ పోచంపాడు గ్రామాలలో ఉన్న శ్రీరాముని ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ శాసనసభ్యులు, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హారతులను స్వీకరించారు. మహిళలతో కలిసి సాంప్రదాయ పద్ధతులలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆమె వెంట సోన్ ఎంపీపీ సమత హరిశ్వర్ రెడ్డి, మారా గంగారెడ్డి గంగన్న, ఉదయ్ కుమార్, అజయ్, రవి తదితరులు ఉన్నారు.