Trending Now

మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రమాదమే..

ఆదివాసి ఆడ బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించుకోవడమే లక్ష్యం..

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాద స్థితిలోకి చేరుకుంటుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పదేళ్లలో దేశ ప్రజలకు ఏమి చేయని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తొలగిస్తాం అనడం విడ్డూరమన్నారు రాజ్యాంగం లేకుండా పోతే రిజర్వేషన్లు ఇక్కడ ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు దేశాన్ని పాలించిన మోడీ ధనవంతులకే వత్తాసు పలికారు తప్ప పేద ప్రజల కోసం చేసింది ఏమీ లేదని చెప్పారు. మాటల గారడీలతో దేశ ప్రజలను మోసగిస్తూ దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమిని దేశంలోని అన్ని ప్రాంతాలలో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నాలుగు నెలల పాలన కాలంలో అమలు చేయడం మహోన్నతమైన కార్యమన్నారు. రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశ భవిష్యత్తు బంగారు బాటలో కొనసాగుతుందని చెప్పారు.అబద్దాలకోరు మోడీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణకు భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలోను కాంగ్రెస్ కు విశేష జన ఆదరణ లభిస్తుందని ఆత్రం సుగుణ గెలుపు ఖాయం అయిందని చెప్పారు. ఈ సందర్భంగా నర్సాపూర్ (జి)కాంగ్రెస్ శ్రేణులు ఐకే రెడ్డి కు ఘన స్వాగతం పలికి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామయ్య, తాజా మాజీ సర్పంచ్ రాం రెడ్డి, మాజీకి ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫసియుద్దీన్ , గంగారాం ,రమణారెడ్డి,కాంగ్రెస్ నాయకులు ముడుసు సత్యనారాయణ, ధర్మాజీ గారి రాజేందర్, పాకాల రాంచందర్, అమరవేణి నర్సాగౌడ్, అనుమల భాస్కర్ ,శ్రీ కాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News