Trending Now

ప్రాణాలతో చెలగాటం.. నకీలీ కూల్ డ్రింక్స్ వ్యాపారం..!

నిద్ర మత్తులో అధికార యంత్రాంగం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 13 : ప్రజల కాలాతీత అవస రాలను ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారులు ఆయా వస్తువులలో కల్తీ చేయడం లేదా నకిలీ సరుకులను విక్రయించడం కొత్తేమి కాదు. ప్రస్తుతం వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని శీతల పానీయాలకు పెరుగుతున్న గిరాకిని బట్టి కొన్ని రకాల కూల్ డ్రింక్ నకిలీవి మార్కెట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ కేంద్రాలతో పాటు కడెం, లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్ పూర్, బాసర, సోన్, తానూర్, కుబీర్ ,కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ (జి) , మామడ, నిర్మల్ రూరల్ లాంటి అతి రద్దీ గల మండల ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం నకిలీ కూల్ డ్రింక్స్ వ్యాపారాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. కొంత మంది నిర్మల్ పట్టణ ప్రముఖ వ్యాపారులు నిజామాబాద్, కరీంనగర్, ధర్మాబాద్ ప్రాంతాలలో ఒరిజినల్ కూల్ డ్రింక్స్ ను మరిపించే తరహాలో ఉండే నకిలీలను పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తూ, వేలాది రూపాయలను సమకూర్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ప్రసిద్ది గాంచిన థమ్స్ అప్, కొకాకోలా, పెప్సీ, మాజా, లిమ్కా, సఫ్రైడ్ తదితర కంపెనీలకు చెందిన సీసాలను లేదా అలాంటి సీసాలపై అదే తరహా ముద్ర వేసి బ్రాండ్లను ఉపయోగించి అందులో నకిలీ పానీయాలను పోసి అమ్ముతున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలే ఈ నకిలీ పానీయాల అమ్మకానికి అనువైన ప్రాంతాలుగా భావించి అక్రమ వ్యాపారులు గ్రామీణ ప్రాంతాలలో మారుమూల మండల కేంద్రాలలో, గ్రామాలలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని తెలిసింది. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని వ్యాపారులు, నకిలీ పానీయాలు విక్రయిస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడూ నిఘా వేసి ఉండాల్సిన పోలీసులు, రెవెన్యూ, సంబంధిత శాఖాధికారులు, ఆరోగ్య సిబ్బందిగాని చూసి చూడనట్లు, తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్మల్ పట్టణంలో మాత్రం రెండు మూటలు ఈ నకిలీ కూల్ డ్రింక్స్ తయారీ ని చేపడుతున్న వ్యాపారాన్ని పట్టణంలోని నిర్భయంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వినిపిస్తున్నాయి ఇదే విధంగా మరో ముఠాకు చెందిన సుమారు పదిమంది పదిమంది వరకు నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి ధర్మాబాద్ ప్రాంతాలలో తయారుచేసిన ఇదే తరహా కూల్ డ్రింక్స్ ఆటోలలో జీపులలో నిర్మల్ దాని పరిసర గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విశ్వాసమే వర్గాల ద్వారా తెలిసింది.

అదేవిధంగా నిర్మల్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎదురవుతున్న తీవ్రమైన నీటి సమస్యను కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది అక్రమ వ్యాపారులు శుద్ధి చేయని సాధారణ నీళ్లను కూడా నీళ్ల ప్యాకెట్లను నింపి నేరుగా రద్దీగా ఉండే ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు కుప్పమంటున్నాయి. సదరు నీళ్ల పాకెట్లపై ఇలాంటి అధికారిక అనుమతి లేని పేర్లను పెట్టేసి ఐఎస్ఐ నకిలీ ముదిరాజ్ వేస్తూ తమ వ్యాపారాలను బారు కాయలుగా బాటంగానే చేపడుతున్నట్లు చెబుతున్నారు. కనీస అవసరాలు లేని ప్రాంతాలలో నకిలీ నీళ్ల ప్యాకెట్ల విక్రయాలు రూ.2 నుంచి రూ. 3 లో వరకు కూడా చేస్తున్నారు. ఒకవైపు నకిలీ కూల్ డ్రింక్స్ వ్యాపారాలను నిర్భయంగానే చేస్తున్న బడా, చిరు వ్యాపారులు సాధారణ నీళ్ళ ప్యాకెట్ లను కూడా విక్రయిస్తూ తమ వ్యాపారాలను లక్షలలోని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపార కేంద్రాలకు ఎవరైనా సంబంధిత విషయాల పట్ల అవగాహన ఉన్న చదువుకొని ఉన్న వారిని వ్యాపారులు ముందుగానే పసిగట్టి తమదైన రీతిలో వారిని అక్కడి నుంచి సాగదోలేందుకు ముందస్తు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు కూల్ డ్రింక్స్, నీళ్ల ప్యాకెట్లు బాటిల్స్ వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడతారని పలువురు ఆశిస్తున్నారు.

Spread the love

Related News

Latest News