Trending Now

అదిలాబాద్ జైలులో ఉన్న భైంసా వాసులను పరామర్శించిన కుటుంబ సభ్యులు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 14 : ఈనెల 9న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షో లో పాల్గొనడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సభలో ఫ్లాకార్డులతో నిరసన తెలిపిన వారిలో కొందరు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని సీసీ ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించి పోలీసులు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా అదిలాబాద్ జైలుకు తరలించారు. ఐదు రోజుల తర్వాత బాధిత కుటుంబాల వారి ఆవేదనను గమనించిన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మంగళవారం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి అదిలాబాద్ జైలులో ఉన్న సదరు కేసులోని బాధితులను వ్యక్తిగతంగా కలిసేందుకు అవకాశం కల్పించారు. బాధితుల కుటుంబాలు బస్సులో ఆదిలాబాద్ కి చేరుకోగానే ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ ఇతర బీజేపీ నాయకులు వారిని కలిసి జైలులో ఉన్న బాధితులను కలిసేందుకు స్థానిక ప్రత్యేక న్యాయవాది ద్వారా అవకాశం కల్పించారు. జైల్ లో ఉన్న తమ వారిని కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేసి నాయకులు వారికి అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించారు.

కన్నీళ్ళ పర్యంతమైన కుటుంబాలు..

అదిలాబాద్ జిల్లాలో ఉన్నకేటీఆర్ రోడ్ షో సభ ఆందోళన బాధితులను ప్రత్యేక బస్సులు కలిసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కనిపించగానే బోరున వినిపిస్తూ తాము ఎదుర్కొంటున్న బాధాలను మొరపెట్టుకున్నారు. పిల్లా పాపాలతో వచ్చిన హనుమాన్ మాల దారులు, ఇతర బాధితుల కుటుంబాలు తమ బాధలను చెప్పుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయితే త్వరలోనే వారికి జైలు నుండి విముక్తి అయ్యే అవకాశాలు లభిస్తాయని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు మనోధైర్యాన్ని ఇచ్చారు.

Spread the love

Related News

Latest News