ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన పటాన్‌చెరు ముత్తంగి వద్ద ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ -3 వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. లారీకి కూడా మంటలు వ్యాపించాయి. లారీలో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.