పార్టీ ఆవిర్భా వేడుకల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్..
ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 27: తెలంగాణ గడ్డమీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోరని.. తెలంగాణ ప్రజల గొంతుక టీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నేడు శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా తీగలగుట్ట పల్లెలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2001లో స్థాపించారని.. పార్టీ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని.. కేసీఆర్ పోరాట పటిమ, పట్టుదలతో పార్టీ స్థాపించిన 13 సంవత్సరాల లోపు .. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంతోనూ పదవుల అపేక్షతోను ఆవిర్భవించిన పార్టీ కాదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో ఉండడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ గడ్డమీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోరని.. చరిత్రను ఎవరు తుడుపేయలేరని అన్నారు. దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని పవిత్ర లక్ష్యంతో టీఆర్ఎస్ ను – బీఆర్ఎస్ గా మార్చారని… దేశమంతా సాగునీరు, వ్యవసాయం అభివృద్ధి చెందాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మనోభావాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలని.. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మాదే..
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మాదేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని 2014, 2018, 2023 లో కూడా బీఆర్‌ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని గంగుల కమలాకర్ ఓడిపోతున్నారని విష ప్రచారం చేశారని.. చివరకు ప్రజలు అద్భుత ఫలితాన్ని ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలల లోపే బీఆర్ఎస్ లేని లోటు కనబడుతుందని అన్నారు. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని 10 సంవత్సరాలు కాలంలో అద్భుత పరిపాలన అందించి.. దేశానికి ఆదర్శంగా నిల్చమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, గంట కళ్యాణి -శ్రీనివాస్, పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, గ్రంధాలయ మాజీ చైర్మన్ పొన్నం, అనిల్ గౌడ్, షౌకత్ అలీ, ఒడ్నల రాజు, గంగాధర చందు, పొన్నం రాజు, మోగులోజి వెంకట్ తదితరులు ఉన్నారు.