ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 3: కాంగ్రెస్, బీజేపీ లకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రోడ్ షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టించుకోరన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు అన్నారు. కానీ 150 రోజులైన కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జూటా మాటలు చెప్పిందని.. మహిళలకు రూ. 2,500లు ఎక్కడ పాయే, మహాలక్ష్మి గ్యారెంటీ మహా మోసం అని రైతులకు రూ. 500 భోనస్ ఏమైందని, రూ. 4,000ల పెన్షన్ హామీ ఎక్కడ పాయే.. జనవరి నెలలో పెన్షన్ ఎగ్గొట్టాడు అని విమర్శించారు. విద్యార్థులకు రూ. 5లక్షల భోరోసా కార్డు.. నిరుద్యోగులకు భృతి..పేదలకు ఇళ్ళు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన బాండ్ పేపర్ల సంగతి ఏమైందన్నారు. బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి.. దేవుళ్ళ మీద ఒట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్దాలు చెప్పి ఆగం చేశారు కళ్యాణలక్ష్మీ, తులం బంగారం ఎక్కడ పాయే కాంగ్రెస్ వచ్చాక ధరలు పెరిగాయని కేసీఆర్ ఇచ్చిన పథకాలకు ఎగనామం పెడుతున్నారన్నారన్నారు. కేసీఆర్ కిట్, రైతు బంధు, మంచినీళ్లు వస్తలేవు ప్రజలు మార్పు కోరుకున్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లు అడ్డుపడ్డ 8 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేసి ట్రయల్ రన్ చేసామని గౌరవెల్లి నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి పూర్తి చేశామన్నారు.
కాంగ్రెస్ వచ్చాక అన్నీ పథకాలు.. గోవిందా అయ్యాయని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గోవిందా అవుతుందన్నారు. ప్రజలంతా ఓట్లు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ రైతు రుణమాఫీ చెయ్యలేదు వినోదన్న అభివృద్ధి సాధకుడు. అక్కన్నపేట అభివృద్ధి చెందాలంటే వినోదన్న గెలవాలని ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చెశాడని ప్రశ్నించారు. బీజేపీ పదేళ్ళలో పెట్రోల్, డీజిల్ దరలు పెంచి ప్రజలపై భారం మోపింది. జీఎస్టీ ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు.
తెలంగాణకు కేసీఆర్ సారే శ్రీరామరక్ష..
కేసీఆర్ సీఎం గా ఉన్నన్ని రోజులు ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ వచ్చాక కష్టాలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీళ్లు బంద్ అయ్యాయి ప్రజలంతా వినోదన్నను ఆశీర్వదించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో గిరిజన బిడ్డ సత్యవతి రాథోడ్ ను మంత్రి చేశారు. కాంగ్రెస్ ఒక్క గిరిజన బిడ్డను మంత్రి చేయలేదన్నారు. బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ అయిన ఇచ్చిందా.. కరీంనగర్ ఎంపీగా వినోదన్నను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.