హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం అన్నారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శిస్తూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.