Trending Now

రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలకు ఉపయోగపడవు..

కాంగ్రెస్‌పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో తిట్లు, శాపనర్ధాలు ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత మాట్లాడతారని సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌‌ను రేవంత్ చచ్చిన పాము అంటున్నారు.. 60 లక్షల మంది సభ్యత్వం వుండి 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని.. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటూనే తిట్ల దండకంతో రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందని.. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్,హోం వర్క్ రెండూ లేవని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు.. రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రకు అసలు ఏమైనా సంబంధం ఉందా..? పార్లమెంట్, అసెంబ్లీకి ఎక్కువ సార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్‌కు ఉందని.. ఎమ్మెల్యేగా తొమ్మిది సార్లు, ఎంపీగా ఐదు సార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఇప్పటి వరకు 14 సార్లు కేసీఆర్ చట్టసభలకు ఎన్నికయ్యారని, కేసీఆర్ రాష్ట్రంలో రెండు సార్లు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి, రెండు సార్లు సీఎంగా పని చేశారని గుర్తుచేశారు.

కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి అనుభవం ఎంత..? రేవంత్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోవాలి. రైతు బంధు, రైతు రుణమాఫీ చేయలేని వ్యక్తి సీఎంగా వున్నారు. కేసీఆర్ ప్రజల దగ్గరకు వెళ్ళనిదే ప్రజలు ఓట్లు వేశారా.. అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మూడు రాష్ట్రాలు మాత్రమేనని.. ఈ మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు మంచి ఆదరణ వస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో బయటపడుతుంది. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదన్నారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా వున్నాయా..? తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండే స్థితికి కేసీఆర్ తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే మేము వద్దు అన్నామా..? రైతు బంధు ఐదు లక్షల మందికి ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డే స్వయంగా అన్నారని గుర్తచేశారు. వాళ్ళు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వెయ్యాలి..? రేవంత్ రెడ్డి కి మానవీయ కోణమే లేదు. వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖలో ఆయన కీలకమైన స్థానం లో ఉన్నపుడే కాళేశ్వరం కు అనుమతి వచ్చింది. అపుడు ఎం చేశారు..? అని ప్రశ్నించారు.

Spread the love

Related News

Latest News