నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్,9 : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అయినను కలిసి వ్యక్తిగతంగా శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపగా.. ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అన్ని రంగాలలో బాగుండబోతున్నదని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.