ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం ‘వెర్సైల్లెస్ ప్యాలెస్’లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా.. ఏకంగా 780 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది.